Share News

అటవీ క్షేత్ర అధికారుల నూతన కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2023-12-11T01:26:23+05:30 IST

తిరుపతి సర్కిల్‌ అటవీ క్షేత్రస్థాయి అధికారుల(ఎ్‌ఫఆర్వో) నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు.

అటవీ క్షేత్ర అధికారుల నూతన కమిటీ ఎన్నిక
నాగేశ్వరరావుకు పుష్పగుచ్ఛాలు అందజేస్తున్న ఎఫ్‌ఆర్‌వోలు

తిరుపతి అర్బన్‌, డిసెంబరు 10 : తిరుపతి సర్కిల్‌ అటవీ క్షేత్రస్థాయి అధికారుల(ఎ్‌ఫఆర్వో) నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని ఎర్రచందనం గోదాము ప్రాంగణంలో రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ జేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సాధారణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీలో అధ్యక్షుడిగా ఎం.మదన్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శిగా ఎన్‌.లక్ష్మీపతి, ఉపాధ్యక్షుడిగా బి.సుదర్శన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా పి.మాధవి, కోశాధికారిగా నారాయణ ఎన్నికయ్యారు. కమిటీ ఎన్నిక అనంతరం జిల్లా సీపీఎఫ్‌ నాగేశ్వరారవును మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2023-12-11T01:26:24+05:30 IST