Share News

కుక్క గొడవ.. వ్యక్తిపై సుత్తితో దాడి

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:13 AM

కుక్క తెచ్చిన గొడవ ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి తలపై సుత్తితో కొట్టడంతో రక్తస్రావమై ఆస్పత్రిపాలయ్యాడు.

కుక్క గొడవ.. వ్యక్తిపై సుత్తితో దాడి

చిత్తూరు, డిసెంబరు 25: కుక్క తెచ్చిన గొడవ ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి తలపై సుత్తితో కొట్టడంతో రక్తస్రావమై ఆస్పత్రిపాలయ్యాడు. చిత్తూరు ఒకటో పట్టణ ఎస్‌ఐ భారతి తెలిపిన ప్రకారం.. నగరంలోని రాజాజీనగర్‌కు చెందిన వెంకటేశ్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడి కుక్కను పెంచుకుంటున్నాడు. సోమవారం తన వద్ద ఉన్న కుక్క ఎదురింటికి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఆ కుక్కను చూసి ఇద్దరు పిల్లలు కిందపడ్డారు. దాంతో పిల్లల తండ్రి గంగాధరం ఆ కుక్కను రాయితో కొట్టాడు. కుక్కను రాయితో కొట్టడాన్ని వెంకటేశ్‌ తట్టుకోలేక ఎందుకు కొడతావని గంగాధరంను ప్రశ్నించాడు. దాంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో గంగాధరం, అతడి మామ చంద్రలు కలిసి వెంకటేశ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వెంకటేశ్‌ తలపై గంగాధరం సుత్తితో కొట్టడంతో తీవ్ర రకస్రావమైంది. దాంతో వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి 11 కుట్లు వేసి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గంగాధరం, చంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 12:14 AM