బాలలను పనిలో పెట్టుకోవద్దు
ABN , First Publish Date - 2023-06-26T01:43:00+05:30 IST
బాలలను పనిలో పెట్టుకోవద్దని వ్యాపార సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ అప్పారావు సూచించారు.
తిరుమల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): బాలలను పనిలో పెట్టుకోవద్దని వ్యాపార సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ అప్పారావు సూచించారు. ఆదివారం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు కొండపై తనిఖీలు నిర్వహించారు. కొన్నిచోట్ల కొందరు బాలలు భిక్షాటన చేయడం, బొమ్మలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. తక్షణమే ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బడి పిల్లలను గుర్తించి.. వారిని పాఠశాలలో చేర్పించే దిశగా విద్యాశాఖ అధికారులు అడుగులు వేయాలన్నారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు.