గుడుపల్లె ఎంపీడీవో మృతి
ABN , First Publish Date - 2023-12-11T00:50:08+05:30 IST
గుడుపల్లె ఎంపీడీవో శ్రీనివాసన్ అనారోగ్యం కారణంగా ఆదివారం మృతి చెందారు
చిత్తూరు (రూరల్/కలెక్టరేట్), డిసెంబరు 10: గుడుపల్లె ఎంపీడీవో శ్రీనివాసన్ అనారోగ్యం కారణంగా ఆదివారం మృతి చెందారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు ఎంపీడీవో పనిచేశారు. గుడుపల్లెలో పనిచేస్తున్న ఆయన అనారోగ్య కారాణాల వల్ల కొన్ని రోజులుగా సెలవుపై ఉన్నారు. ఆదివారం మృతి చెందారు. చిత్తూరు నగరం మురగానపల్లిలో ఆయన భౌతిక కాయానికి జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. దహన క్రియలకు నగదు సాయాన్ని అందించారు. జిల్లాలోని పలువురు ఎంపీడీవోలు కూడా వచ్చి శ్రీనివాసన్‌కు నివాళులర్పించారు.