అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-03-19T01:04:06+05:30 IST

నగరి ఏరియా వైద్యశాలకు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సురేష్‌ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం గుర్తు తెలియని యువకుడు తీసుకొచ్చి చేర్పించాడు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

నగరి, మార్చి 18: నగరి ఏరియా వైద్యశాలకు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సురేష్‌ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం గుర్తు తెలియని యువకుడు తీసుకొచ్చి చేర్పించాడు. అతడు నెత్తురు కక్కుతుండడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. శనివారం వేకువజామున 3 గంటలకు సురేష్‌ మృతి చెందారు. కాగా, ఆస్పత్రిలో చేర్పించిన యువకుడు కనిపించకుండా పారిపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడుకు చెందిన షోలింగర్‌ తమ స్వగ్రామమంటూ సురే్‌షను ఆ యువకుడు చేర్పించి పారిపోయాడు. అతను ఇచ్చిన ఫోన్‌ నెంబరుకి వైద్యులు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన సురే్‌షను నగరి ఏరియా వైద్యశాలలో శవాల గదిలో భద్రపరచారు. చేర్పించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-03-19T01:04:06+05:30 IST