కాణిపాకంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2023-09-20T01:17:09+05:30 IST

వినాయక చవితిని పురస్కరించుకొని సోమవారం కాణిపాక క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం తక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు.

కాణిపాకంలో భక్తుల రద్దీ

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 19: వినాయక చవితిని పురస్కరించుకొని సోమవారం కాణిపాక క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం తక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. 11 గంటల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం విచ్చేశారు. ఒక్కసారిగా భక్తులు విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. దీంతో స్వామి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - 2023-09-20T01:17:09+05:30 IST