కాణిపాకంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2023-09-04T00:42:19+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిక్కిరిసింది.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 3: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. ఉదయం నుంచి వరసిద్ధుడి దర్శనానికి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. దీంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.