ఢిల్లీకి కలెక్టర్ పయనం
ABN , First Publish Date - 2023-12-11T00:36:57+05:30 IST
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
నేడు, రేపు ఎన్నికల శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 10: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. త్వరలో జరగనున్న లోక్‌సభ-2014 ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల సర్టిఫికేషన్ ప్రోగ్రాం శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది. సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోని ఐఐడీఈఎం హాస్టల్‌లో శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు సహా 14 జిల్లాల కలెక్టర్లకు ఆహ్వానం అందింది. తిరుపతి సహా మిగిలిన 12 మంది కలెక్టర్లకు ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి.