చిత్తూరు- తచ్చూరు హైవే పెరిగిన భూముల ధరలు

ABN , First Publish Date - 2023-05-26T00:38:51+05:30 IST

చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి 716బి హైవే పనులు జోరుగా జరుగుతున్నాయి. హైవే పనులు జోరుగా జరడగంతో విజయపురం మండల పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పలువురు భూముల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు.

చిత్తూరు- తచ్చూరు హైవే పెరిగిన భూముల ధరలు
పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులు

- పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద సర్వీస్‌ రోడ్డు కోసం స్థానికుల డిమాండ్‌

విజయపురం, మే 25: చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి 716బి హైవే పనులు జోరుగా జరుగుతున్నాయి. హైవే పనులు జోరుగా జరడగంతో విజయపురం మండల పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పలువురు భూముల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలికిన భూముల ధర ఏకంగా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు చేరిందని వ్యాపారులు అంటున్నారు. కాగా, ఈ హైవే పూర్తయితే నగరి, నిండ్ర, విజయపురం మండలాల వాసులు జిల్లా కేంద్రమైన చిత్తూరుకు చేరుకోవడం సులభమవుతుంది. దీనికోసం పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని మండల వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. విజయపురం మండలంలో కోసలనగరం, మహారాజపురం ప్రాంతాలను పారిశ్రామిక వాడగా గుర్తించారు. సుమారు 2000 ఎకరాల భూమిని కూడా పరిశ్రమల కోసం ప్రభుత్వం సేకరించింది. మండలానికి సమీపంలో తమిళనాడు సరిహద్దులు ఉండడం, తిరుత్తణి సుబ్రహ్మణ్యంస్వామి ఆలయం, శ్రీకాళహస్తి శివాలయం, సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు సమీపంలో ఉండడం వలన హైవే రోడ్డులో ప్రయాణం చేయడానికి వీలుగా పన్నూరు సబ్‌స్టేషన్‌ కూడలి ప్రాంతలో సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద సర్వీసు రోడ్డు విషయమై ప్రజా ప్రతినిధులు స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-05-26T00:38:51+05:30 IST