కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై తిరుమలేశుడి చిద్విలాసం

ABN , First Publish Date - 2023-09-22T03:37:53+05:30 IST

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు గురువారం ఉదయం కల్ప వృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై విహరిస్తూ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై తిరుమలేశుడి చిద్విలాసం

నేడు గరుడ వాహన సేవ

తిరుమల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు గురువారం ఉదయం కల్ప వృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై విహరిస్తూ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు తిరుమలేశుడు దర్శనమివ్వనున్నాడు. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమవుతుంది. గ్యాలరీల్లోని భక్తులందరికీ దర్శనం పూర్తయ్యే వరకు అర్ధరాత్రి రెండు గంటల వరకైనా వాహన సేవను నిర్వహించాలని టీటీడీ నిర్ణయింది. గ్యాలరీల్లోకి చేరే సుమారు రెండు లక్షల మంది భక్తులతో పాటు మాడవీధుల్లోని మలుపుల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా అదనంగా మరో 50వేల మందికి, రీఫిల్లింగ్‌ విధానం ద్వారా మరో 10వేల మందికి దర్శనం చేయించాలని టీటీడీ ప్రణాళిక రూపొందించుకుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. మొత్తం ఐదువేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక, గురువారం మధ్యాహ్నం శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుంచి వచ్చిన గోదాదేవి మాలలు, చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధసమితి తరఫున తొమ్మిది నూతన గొడుగుల సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది.

Updated Date - 2023-09-22T03:37:53+05:30 IST