ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-03-18T00:40:34+05:30 IST

1043 ఓట్ల మెజార్టీతో విజయం డిక్లరేషన్‌ అందించిన అధికారులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌రెడ్డి
డిక్లరేషన్‌ను ఇస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 17: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసీపీ బలపరచిన అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. శుక్రవారం తెల్లవారుజామున ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అధికారులు ఆయనను విజేతగా ప్రకటించి, ఎమ్మెల్సీ డిక్లరేషన్‌ను అందించారు. చిత్తూరులోని లెక్కింపు కేంద్రంలో గురువారం ఉదయం లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రౌండ్‌ నుంచి నాలుగో రౌండ్‌ వరకు కూడా వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ఆధిపత్యంలో ఉన్నారు. అయినప్పటికీ కోటా మేరకు 50 శాతానికి మించిన ఓట్లు రాకపోవడంతో గురువారం రాత్రి రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించడం (ఎలిమినేషన్‌) ప్రారంభించారు. ఒకటో ప్రాధాన్యతతో పాటు రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో కూడా పీడీఎఫ్‌ అభ్యర్థి బాబురెడ్డి గట్టి పోటీనిచ్చారు. ఎలిమినేషన్‌ రౌండులో ఏపీటీఎఫ్‌ అభ్యర్థి ఎల్‌సీ రమణారెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యతా ఓట్లు వైసీపీ విజయానికి కారణమైనట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించే సమయానికి 10,862 ఓట్లతో వైసీపీ చంద్రశేఖర్‌రెడ్డి, 8,908 ఓట్లతో పీడీఎఫ్‌ బాబురెడ్డి పొక్కిరెడ్డి మిగిలి ఉండగా ఎవరికీ కోటా మేరకు గెలిచే ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించగా చంద్రశేఖర్‌రెడ్డికి 11,714 ఓట్లు, బాబురెడ్డికి 10,671 ఓట్లు వచ్చాయి. చివరికి చంద్రశేఖర్‌రెడ్డికి 1043 ఓట్ల మెజారిటీతో విజయం దక్కింది. ఆర్వో, కలెక్టర్‌ హరినారాయణన్‌ శుక్రవారం ఆయనకు డిక్లరేషన్‌ను అందించారు.

అభ్యర్థి పేరు: పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

తల్లిదండ్రులు: సుజాతమ్మ, సుందరరామిరెడ్డి

పుట్టిన ఊరు: వల్లిపేడు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా

ప్రస్తుత నివాసం: చిల్డ్రన్స్‌ పార్కు వద్ద, నెల్లూరు

చదువు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌. నెల్లూరులో ఇంటర్‌ వరకు, తిరుపతి ఎస్వీయూలో ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివారు.

ప్రస్తుతం: శ్రీకృష్ణచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌గా ఉన్నారు.

Updated Date - 2023-03-18T00:41:59+05:30 IST