చంద్రబాబుకు లక్ష మెజారిటీ ఖాయం
ABN , First Publish Date - 2023-08-16T01:11:51+05:30 IST
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు లక్ష మెజారిటీ ఖాయమని టీడీపీ కొత్తపేట ఇన్‌ఛార్జి అప్పు ముఖేశ్ అన్నారు.
కుప్పం, ఆగస్టు 15: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు లక్ష మెజారిటీ ఖాయమని టీడీపీ కొత్తపేట ఇన్‌ఛార్జి అప్పు ముఖేశ్ అన్నారు. కొత్తపేటలో మంగళవారం అప్పు ఆధ్వర్యంలో భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. తెలుగు యువత ప్రతినిధులు 51 మంది 51 కొబ్బరికాయలు కొట్టి వినాయక స్వామికి పూ జలు చేశారు. తర్వాత యాత్ర చేపట్టారు. మహిళలు మంగళ హారతులతో సైకిల్ యాత్రకు స్వాగతం పలికారు.