పాము పట్టివేత
ABN , First Publish Date - 2023-12-11T01:27:39+05:30 IST
తిరుమలలో ఆదివారం ఓ జెర్రిపోతు పట్టుబడింది.
తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం ఓ జెర్రిపోతు పట్టుబడింది. గోగర్భం డ్యాం వద్దనున్న సబ్‌స్టేషన్‌లోకి ఏడు అడుగుల పొడవున్న జెర్రిపోతు చొరబడింది. గుర్తించిన సిబ్బంది.. పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.