నేడు వాహన మిత్ర లబ్ధిదారులకు నగదు జమ
ABN , First Publish Date - 2023-09-29T00:48:38+05:30 IST
జిల్లాలోని 6482 మందికి వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు వంతున రూ.6.48 కోట్లు శుక్రవారం ప్రభుత్వం జమ చేయనుంది.
చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు సిటీ, సెప్టెంబరు 28: జిల్లాలోని 6482 మందికి వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు వంతున రూ.6.48 కోట్లు శుక్రవారం ప్రభుత్వం జమ చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారని కలెక్టరు షన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోనూ కార్యక్రమం జరగనుందన్నారు. కాగా, వివిధ కారణాలను చూపుతూ గతంలో అర్హులైన కొందరు లబ్ధిదారులను ప్రస్తుతం అనర్హులు పేర్కొంటూ తొలగించారు.