నెలాఖరులోగా పెండింగ్‌లోని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తాం

ABN , First Publish Date - 2023-06-11T01:36:05+05:30 IST

‘జిల్లాలో 20వేల మందికిపైగా రైతులు వ్యవసాయ విద్యుత్‌ కనెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 12వేల కనెక్షన్లు ఇచ్చాం. నెలాఖరులోగా పెండింగ్‌లోని కనెక్షన్లు ఇస్తాం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

నెలాఖరులోగా పెండింగ్‌లోని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తాం

- మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 10: ‘జిల్లాలో 20వేల మందికిపైగా రైతులు వ్యవసాయ విద్యుత్‌ కనెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 12వేల కనెక్షన్లు ఇచ్చాం. నెలాఖరులోగా పెండింగ్‌లోని కనెక్షన్లు ఇస్తాం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారంజడ్పీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇళ్లపై నుంచి వెళుతున్న హైటెన్షన్‌ వైర్లను తొలగించాలని చెప్పారు. వేసవిలో సైతం 24 గంటలపాటు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులను ఇచ్చామన్నారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమం అమలులో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అందరికీ ఆరోగ్యంలో భాగంగా ఈ ఏడాదినుంచి డాక్టర్లు, నర్సుల ఖాళీల భర్తీని జిల్లాస్థాయిలో చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రతి మండలంలో కొత్తగా రూ.60లక్షల విలువైన ఉపాధి పనులు చేపట్టడానికి అనుమతులు ఇస్తున్నట్లు తెలియజేశారు. నాడు-నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రి భవనాల నిర్మాణాలు చేపట్టామన్నారు.

Updated Date - 2023-06-11T01:36:05+05:30 IST