సమస్యలు ‘ఫేస్‌’ చేస్తూ..!

ABN , First Publish Date - 2023-01-18T00:28:57+05:30 IST

తొలిరోజు ముఖ హాజరుకు ఉద్యోగుల ఇక్కట్లు చాలాచోట్ల పనిచేయని ఫేషియల్‌ అటెండెన్స్‌

సమస్యలు ‘ఫేస్‌’ చేస్తూ..!
పాలసముద్రం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద.సిబ్బంది తంటాలు

చిత్తూరు, ఆంధ్రజ్యోతి

అధికారులు, ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్‌ స్థానంలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ అటెండెన్స్‌ (ముఖ హాజరు) విధానాన్ని మంగళవారం ప్రారంభించింది. జిల్లా కార్యాలయాల్లో ఈ నెల ఒకటి నుంచి ప్రారంభించగా.. డివిజన్‌, మండల స్థాయి కార్యాలయాల్లో 17 నుంచి మొదలు పెట్టింది. యాప్‌ డౌన్‌లోడ్‌ మీద సరైన అవగాహన లేకపోవడం, యాప్‌లో అనేక లోపాలుండడం, నెట్‌వర్క్‌ అందకపోవడం.. వంటి కారణాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. తొలిరోజు ఈ యాప్‌ అమలుకాని చోట సచివాలయ ఉద్యోగులు సహా ఇతర శాఖల ఉద్యోగులూ బయోమెట్రిక్‌ విధానాన్నే అనుసరించారు.

అప్పట్లోనే వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు

ఆరు నెలల కిందట ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఈ ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పట్లో ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వమే ఆండ్రాయిడ్‌ ఫోన్లను పంపిణీ చేసి, ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించాలని డిమాండు చేశాయి. సాంకేతిక కారణాలతో అటెండెన్స్‌ పడకపోతే తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నించాయి. అప్పట్లో ఎన్జీవో, రెవెన్యూ తదితర సంఘాల నాయకులు దీనిపై మిన్నకుండిపోవడమే కాకుండా తమ వరకు రాలేదని ప్రభుత్వానికే వత్తాసు పలికారు. ఇప్పుడు వారికి కూడా వర్తింపజేయడంతో ఆయా సంఘాలు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

మూలనపడ్డ బయోమెట్రిక్‌, ఐరిష్‌ పరికరాలు..

వివిధ శాఖల్లో ఉద్యోగులు క్షేత్రస్థాయి పర్యటనలు, పలు సమావేశాలకు హాజరు కావాల్సిన తరుణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొరపాటున ఉద్యోగి సెల్‌ఫోను మరిచిపోయినా, అందులో డేటా లేకపోయినా, సర్వర్‌ పనిచేయకపోయినా గైర్హాజరుగా నమోదవుతుండడంతో లబోదిబోమంటున్నారు. ప్రతిశాఖలో ఉన్న పర్యవేక్షణ అధికారులను ఇది అవమానించడమేనని వారు విమర్శిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, ఎంపీడీవో, ఎమ్మార్వో తదితర అధికారుల పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేసి పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం, దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం సరఫరా చేసిన బయోమెట్రిక్‌, ఐరిష్‌ పరికరాలు మూలన పడేయడంతో రూ.వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరిందని ఆరోపిస్తున్నారు.

శాఖాధిపతి ద్వారా రిజిస్ర్టేషన్‌

ఈ యాప్‌ను రిజిస్ర్టేషన్‌ చేయాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతులదే. తొలుత ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన శాఖాధిపతులు యాప్‌ను రిజిస్ర్టేషన్‌ చేసుకుని తన పరిధిలోని అధికారులు, ఉద్యోగులను మ్యాపింగ్‌ చేయాలి. ఉదాహరణకు మండలంలోని రెవెన్యూ ఉద్యోగులందరికీ తహసీల్దార్‌, సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీవో రిజిస్ట్రేషన్‌, మ్యాపింగ్‌ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఉద్యోగులకు రిజిస్ట్రేషన్‌ ఐడీని అందిస్తే వాళ్లంతా ఫేషియల్‌ అటెండెన్స్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, రిజిస్టర్‌ అయి అటెండెన్స్‌ వేయాలి. అధికారులకు ఈ యాప్‌ మీద ముందస్తు శిక్షణ, అవగాహన కల్పించకుండా హుటాహుటిన అమలు చేయడం కూడా ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. జిల్లాలో ఇంకా చాలామంది ఉద్యోగులకు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులతో పాటు డ్వామా, డీఆర్‌డీఏ శాఖలకు చెందిన ఉగ్యోగుల కోసం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాకు యాప్‌ ఇంకా రూపొందించలేదని అధికారులు చెబుతున్నారు.

బయోమెట్రిక్‌ విధానంలోనే అటెండెన్స్‌

డివిజన్‌, మండల కేంద్రాల్లో ఫేషియల్‌ అటెండెన్స్‌ యాప్‌తో ఉద్యోగులు తొలిరోజు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులెవ్వరికీ ఈ యాప్‌ పనిచేయలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారంతా పాత విధానమైన బయోమెట్రిక్‌తోనే హాజరు వేశారు. ఫేషియల్‌ యాప్‌ పనిచేయని మిగతా శాఖల ఉద్యోగులు కూడా బయోమెట్రిక్‌ ద్వారానే తమ హాజరు వేశారు. సచివాలయ ఉద్యోగుల హాజరు ఎప్పటికీ బయోమెట్రిక్‌ విధానంతోనే ఉంటుందా? తాత్కాలిక సడలింపు ఇచ్చారా.. అనేది స్పష్టత రావాలి. మంగళవారం ప్రారంభించిన ఈ ఫేషియల్‌ అటెండెన్స్‌ పంచాయతీ కార్యదర్శులకు మాత్రం పనిచేసింది.

ఆయా ప్రాంతాల్లో ఉద్యోగుల ఇబ్బందులు

సోమల తహసీల్దార్‌ కార్యాలయంలో కొందరికి సమయానికి అటెండెన్స్‌ నమోదైనా, మరికొందరికి కాకపోవడంతో ఆందోళన పడ్డారు. గుడుపల్లె మండలంలోని సచివాలయాల్లో కార్యదర్శులకు ఈ యాప్‌తో అటెండెన్స్‌ నమోదవ్వగా, మిగిలిన ఉద్యోగులకు కాలేదు. తవణంపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 11 వరకు కూడా ఈ యాప్‌ ఓపెన్‌ కాకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. పాలసముద్రంలో తహసీల్దార్‌, ఎంపీడీవోలకు ముఖ హాజరు పడినా, వారి సిబ్బందికి మాత్రం సర్వర్‌ పనిచేయక హాజరుపడలేదు. ఇలా అన్ని మండలాల్లోనూ అధికారులు, ఉద్యోగులను ఈ ముఖ హాజరు ముప్పుతిప్పలు పెట్టింది.

Updated Date - 2023-01-18T00:29:35+05:30 IST