శ్రీవారి సేవలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
ABN , First Publish Date - 2023-07-21T02:40:52+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఏపీ, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరెత్ విన్ ఓవెన్ గురువారం దర్శించుకున్నారు.
తిరుమల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఏపీ, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరెత్ విన్ ఓవెన్ గురువారం దర్శించుకున్నారు. ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటిసారిగా తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.