టీడీపీ గెలుపుకు బీఎల్‌ఏలే కీలకం

ABN , First Publish Date - 2023-07-21T00:36:07+05:30 IST

టీడీపీ గెలుపునకు బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) కీలకమని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం బీఎల్‌ఏలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీ గెలుపుకు బీఎల్‌ఏలే కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ దొరబాబు

మాజీ ఎమ్మెల్సీ దొరబాబాబు

చిత్తూరు సిటీ, జూలై 20: టీడీపీ గెలుపునకు బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) కీలకమని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం బీఎల్‌ఏలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దొరబాబు మాట్లాడుతూ శుక్రవారం నుంచి బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ) ఓటర్ల పరిశీలనకు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలించనున్నారని చెప్పారు. ఈ పరిశీలనలో నిజమైన ఓటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించేవిధంగా బీఎల్‌ఓలకు సూచించాలన్నారు. బీఎల్‌ఏలకు తమ పరిధిలోని ఓటర్ల గురించి సమగ్రంగా తెలుసని చెప్పారు. మరణించిన వారు, అద్దె ఇళ్లలో మారిన వారు ఇలా నిజమైన ఓటర్లను గుర్తించి బీఎల్‌వోలకు చెప్పాలన్నారు. ఈ ఓటర్ల పరిశీలనకు వలంటీర్లను అనుమతించరని తెలిపారు. బీఎల్‌వో, బీఎల్‌ఏలే ఓటర్ల జాబితా సవరణ చేస్తారని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించినట్లు గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, మాజీ మేయర్‌ కటారి హేమలత, పార్టీ చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజి, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌, నేతలు త్యాగరాజన్‌, రాజశేఖర్‌, రఘు, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:36:07+05:30 IST