Share News

భక్తజనసంద్రం.. ముక్కంటి ఆలయం

ABN , First Publish Date - 2023-10-30T02:19:34+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తజనసంద్రం.. ముక్కంటి ఆలయం
ఆలయం వద్ద కిక్కిరిసి ఉన్న భక్తులు

శ్రీకాళహస్తి, ఆక్టోబరు 29: శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 800మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,952మంది దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,572మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 971, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 333మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 274మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 77మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 17,562 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-10-30T02:19:34+05:30 IST