నేడు ఆయుర్వేద ఉత్పత్తుల షెడ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-31T00:53:19+05:30 IST

మండలంలోని నరసింగా పురంలోని టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో నూతన ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక యంత్రాలతో నిర్మించిన షెడ్‌ను శుక్రవారం ప్రారంభిం చనున్నారు.

నేడు ఆయుర్వేద ఉత్పత్తుల షెడ్‌ ప్రారంభం
ఆయుర్వేద ఫార్మసీని పరిశీలిస్తున్న జేఈవో సదాభార్గవి

చంద్రగిరి, మార్చి 30: మండలంలోని నరసింగా పురంలోని టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో నూతన ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ కోసం అత్యాధునిక యంత్రాలతో నిర్మించిన షెడ్‌ను శుక్రవారం ప్రారంభిం చనున్నారు. ఈ క్రమంలో గురువారం టీటీడీ జేఈవో సదాభార్గవి అధికారులతో కలిసి ప్రారంభోత్సవ పనుల ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 314 నూతన ఔషధాలు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేస్తామన్నారు. అనంతరం తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని ఎస్వీ గోశాలలో నిర్మించిన పరిమళ భరిత అగర బత్తీల తయారీ రెండో యూనిట్‌ను, నూతనంగా నిర్మించిన ఫీడ్‌ మిక్సింగ్‌ ఫ్లాంట్‌ను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో సీఈ నాగేశ్వరరావు, ఎస్వీ గోశాల డైరెక్టర్‌ డాక్టర్‌ హరినాథ్‌ రెడ్డి, ఎస్‌ఈలు సత్య నారాయణ, వేంకటేశ్వర్లు, ఆయుర్వేద కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేణు దీక్షిత్‌, ఫార్మసీ టీఏ డాక్టర్‌ నారపరెడ్డి, ఈఈ మురళీకృష్ణ, డీఈ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:53:19+05:30 IST