27న ఈపీఎ్‌ఫఓపై అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2023-01-26T02:54:15+05:30 IST

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎ్‌ఫఓ) ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కారార్థం అవగాహన సదస్సు తిరుచానూరురోడ్డులోని ఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం, చిత్తూరులోని న్యూకలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఈనెల 27న ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ భవిష్యనిధి అధికారి (రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌) జ్ఞానేంద్రకుమార్‌ఖనోజియా తెలిపారు.

27న ఈపీఎ్‌ఫఓపై అవగాహన సదస్సు

తిరుపతి(కొర్లగుంట), జనవరి 25: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎ్‌ఫఓ) ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కారార్థం అవగాహన సదస్సు తిరుచానూరురోడ్డులోని ఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం, చిత్తూరులోని న్యూకలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఈనెల 27న ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ భవిష్యనిధి అధికారి (రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌) జ్ఞానేంద్రకుమార్‌ఖనోజియా తెలిపారు. పాత తిరుచానూరురోడ్‌ కెనడినగర్‌లోఉన్న ఈపీఎ్‌ఫవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు సౌకర్యార్థం దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో నెలకోసారి అవగాహన, ఔట్‌రీచ్‌ కార్యక్రమాలు నిర్వహించదలచామన్నారు. తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు. నూతన సంస్థల పరిచయాలు, యజమానులు, కాంట్రాక్టర్స్‌ను సంప్రదించే ఆన్‌లైన్‌ సేవలు, నూతన కార్యక్రమాలు, సంస్కరణలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలకు ప్రాధాన్యమిచ్చి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. కావున వినియోగదరులు తమ విలువైన సమస్యలను, సందేహాల నివృత్తికోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం తిరుపతి(9848585597), చిత్తూరు(9948182877)నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-01-26T02:54:16+05:30 IST