నేడు, రేపు హజ్‌ యాత్రికులకు అవగాహన, టీకా కార్యక్రమం

ABN , First Publish Date - 2023-05-27T00:24:22+05:30 IST

హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు శని, ఆదివారాల్లో చిత్తూరు గూలింగ్స్‌పేటలో ఉన్న మసీదులో అవగాహన, టీకా కార్యక్రమం ఉంటుందని జిల్లా వక్ఫ్‌బోర్డు ఉపాధ్యక్షుడు గఫార్‌ఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు, రేపు హజ్‌ యాత్రికులకు అవగాహన, టీకా కార్యక్రమం

చిత్తూరు/పుంగనూరు రూరల్‌, మే 26: హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు శని, ఆదివారాల్లో చిత్తూరు గూలింగ్స్‌పేటలో ఉన్న మసీదులో అవగాహన, టీకా కార్యక్రమం ఉంటుందని జిల్లా వక్ఫ్‌బోర్డు ఉపాధ్యక్షుడు గఫార్‌ఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు హజ్‌యాత్రకు వెళ్లే వారికి అక్కడ వాతావరణం, ఇతర అవసరాలపై అవగాహన కల్పిస్తారన్నారు. రెండో రోజున యాత్రకు వెళ్లే వారికి టీకాలు వేస్తారని పేర్కొన్నారు. కాగా, హజ్‌యాత్రకు ప్రభుత్వ తరపున వెళుతున్న ముస్లింలకు ఆదివారం పుంగనూరు ఎంబీటీ రోడ్డు ఉర్దూ పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు అంజుమన్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎస్‌ సలీం, ఇబ్రహీం శుక్రవారం తెలిపారు.

Updated Date - 2023-05-27T00:24:22+05:30 IST