14న కరువు పరిశీలన బృందం రాక
ABN , First Publish Date - 2023-12-11T01:07:39+05:30 IST
ఖరీ్‌ఫలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర కరువు పరిశీలన బృందం ఈనెల 14న జిల్లాకు రానుంది.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 10: ఖరీ్‌ఫలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర కరువు పరిశీలన బృందం ఈనెల 14న జిల్లాకు రానుంది. పలమనేరు, గంగవరం, రొంపిచెర్ల, రామకుప్పం మండలాలను కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. డీఏఎ్‌ఫడబ్ల్యు జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ నేతృత్వంలోని 10మంది సభ్యులతో కూడిన బృందం జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించి అంచనాలు వేయనుంది. ఈనెల 14న ఉదయం 10.30 గంటలకు పలమనేరు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో వేరుశనగ పంట నష్టం అంచనా వేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రామకుప్పం మండలం గోరిమాకులపల్లి, బందార్లపల్లి గ్రామాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జిల్లా వ్యవసాయ అధికారులు, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక్కడి కరువు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.