నదీ హారతులకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-12-11T00:23:19+05:30 IST
స్వర్ణముఖి నదీ హారతులకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన మంగళవారం కార్తీక మాసం అమావాస్య పరిష్కరించుకుని స్వర్ణముఖి నది హారతులు శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.
శ్రీకాళహస్తి డిసెంబరు 10: స్వర్ణముఖి నదీ హారతులకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన మంగళవారం కార్తీక మాసం అమావాస్య పరిష్కరించుకుని స్వర్ణముఖి నది హారతులు శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు. ప్రతి సంవత్సరంలాగే సన్నిధి వీధి జల వినాయక ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నదిలో హారతులు సమర్పించే ఘట్టానికి వేదికను రెండు రోజుల నుంచి సిద్ధం చేస్తున్నారు. ముక్కంటి ఆలయ ఇంజనీరింగు అధికారులు షెడ్డు, విద్యుత్ దీపాలంకరణ, భక్తులకు అవసరమైన వసతులు కల్పింంచే పనులు చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వరాలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.