చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఏఆర్వోల నియామకం

ABN , First Publish Date - 2023-08-11T02:22:37+05:30 IST

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధిచి చిత్తూరు పార్లమెంటు స్థాన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లను నియమిస్తూ గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఏఆర్వోల నియామకం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 10: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధిచి చిత్తూరు పార్లమెంటు స్థాన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లను నియమిస్తూ గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆర్వోలకు ఎన్నికల సమయంలో సహకరిస్తారు. తిరుపతి ఆర్డీవో, చిత్తూరు జేసీ, చిత్తూరు డీఆర్వో, నగరి ఆర్డీవో, చిత్తూరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌- ఐవోసీఎల్‌, చిత్తూరు ఆర్డీవో, పలమనేరు ఆర్డీవో, కుప్పం ఆర్డీవోలను ఏఆర్వోలుగా నియమించింది.

Updated Date - 2023-08-11T02:22:37+05:30 IST