తెలుగు యువత నేతపై మరో కేసు
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:28 PM
తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిపై మరో కేసు నమోదైంది. గతంలో గూడూరు వద్ద నేషనల్ హైవేని దిగ్బంధించారంటూ అక్కడి రూరల్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం పరిధిలో నివాసం ఉంటున్న రవినాయుడు ఇంటికి మంగళవారం గూడూరు నుంచి వచ్చిన పోలీసులు 41 నోటీసు అందజేశారు.
41 నోటీసు ఇచ్చిన గూడూరు పోలీసులు
తిరుపతి (రవాణా), డిసెంబరు 26: తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిపై మరో కేసు నమోదైంది. గతంలో గూడూరు వద్ద నేషనల్ హైవేని దిగ్బంధించారంటూ అక్కడి రూరల్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం పరిధిలో నివాసం ఉంటున్న రవినాయుడు ఇంటికి మంగళవారం గూడూరు నుంచి వచ్చిన పోలీసులు 41 నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూసిన ఏ ప్రభుత్వమూ చరిత్రలో మనుగడ సాగించినట్లు లేదని చెప్పారు. జగన్‌ను గద్దె దించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన నేపథ్యంలో రవినాయుడిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.