ఇంకా నీళ్లలోనే పంటలు
ABN , First Publish Date - 2023-12-11T00:43:07+05:30 IST
వర్షాలు ఆగి నాలుగు రోజులైనా వరద తీవ్రత తగ్గడం లేదు. విజయపురం మండలంలోని గొల్లకండ్రిగ వద్ద తిరుత్తణి- నాగలాపురం రోడ్డులో నూతనంగా రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు తూము పూడిపోయింది.
విజయపురం, డిసెంబరు 10: వర్షాలు ఆగి నాలుగు రోజులైనా వరద తీవ్రత తగ్గడం లేదు. విజయపురం మండలంలోని గొల్లకండ్రిగ వద్ద తిరుత్తణి- నాగలాపురం రోడ్డులో నూతనంగా రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు తూము పూడిపోయింది. దీంత వర్షపునీరు, గొల్లకండ్రిగ చెరువు మొరవ పారే నీరు పంట పొలం వదిలి వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వర్షం కురినప్పుడల్లా నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పంట కుళ్లిపోతోందని వాపోతున్నారు. మహారాజపురంలో కూడా వరద ఉధృతి ఉండటం వలన వరి పంట నీటమునిగింది.