Share News

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతి

ABN , First Publish Date - 2023-12-03T00:50:30+05:30 IST

చిత్తూరు నగరంలోని షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతి

చిత్తూరు రూరల్‌, డిసెంబరు 2: చిత్తూరు నగరంలోని షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈమెకు సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని, మెరూన్‌ రంగు టాప్‌, పింక్‌ రంగు చున్నీ ధరించి ఉందన్నారు. ఈ మహిళ గురించి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-06T07:09:10+05:30 IST