రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:16 PM
చిత్తూరు-పూతలపట్టు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సమాచారం అందుకున్న చిత్తూరు ఆర్‌పీఎస్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 17: చిత్తూరు-పూతలపట్టు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సమాచారం అందుకున్న చిత్తూరు ఆర్‌పీఎస్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 45-50 సంవత్సరాల వయసు కలిగిన మృతుడి కుడి చేతిపైన నెమలి ఈక బొమ్మ కలిగిన పచ్చబొట్టు ఉంది. తెలుపు-నీలి రంగు నిలువు గీతల చొక్కా, నీలి-నలుపు రంగు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియరాలేదు. దాంతో మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచారు. మృతుడి పూర్తి వివరాలు తెలిసిన వారు చిత్తూరు రైల్వే ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ 9494228854కు తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.