Share News

బీసీల అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2023-11-20T00:28:40+05:30 IST

చిత్తూరులోని సంతపేట ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఈనెల 21న నిర్వహించే జిల్లా స్థాయి అఖిలపక్ష బీసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని టీడీపీ బీసీ సెల్‌ నేతలు పిలుపునిచ్చారు.

బీసీల అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని   విజయవంతం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ బీసీ సెల్‌ నేతలు

చిత్తూరు సిటీ, నవంబరు 19: చిత్తూరులోని సంతపేట ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఈనెల 21న నిర్వహించే జిల్లా స్థాయి అఖిలపక్ష బీసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని టీడీపీ బీసీ సెల్‌ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో వీరు విలేకరులతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచకపాలన, బీసీలపై జరిగినదాడులు, అన్యాయాలు, తప్పుడు కేసులు, హత్యలు, బీసీ రిజర్వేషన్‌ తగ్గించడం, బీసీ కార్పొరేషన్‌ నిధుల రద్దు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. సీఎం జగన్‌ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించేందుకు బీసీలు ఏకంకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి, రాష్ట్ర వన్నియకుల క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, నేతలు సీఆర్‌ రాజన్‌, నేతలు వినాయకం గౌండర్‌, శ్రీధర్‌ యాదవ్‌, ఈశ్వర్‌, ధరణి ప్రకాష్‌, శంకర్‌, మురుగన్‌, త్రిమూర్తి, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:28:41+05:30 IST