మీడియాకు ముఖం చాటేసిన ఆలీ
ABN , First Publish Date - 2023-01-18T00:16:16+05:30 IST
తిరుపతి విమానాశ్రయంలో
తిరుపతి(తిలక్‌రోడ్), జనవరి 17: తిరుపతి విమానాశ్రయంలో మంగళవారం సినీనటుడు ఆలీ మీడియాకు ముఖం చాటేశారు. మధ్యాహ్నం నగరిలో జరిగిన కార్యక్రమానికి హాజరై హైదరాబాదుకు వెళ్లడానికి రాత్రి 7.30గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడున్న మీడియా ప్రతినిధులు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై పోటీకి సిద్ధమా అని ప్రశ్నించారు. కొంతసేపు అటూ ఇటు చూసిన ఆయన ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటికే వ్యక్తిగత సిబ్బంది ఒక నిమిషం అంటూ ఆలీని పక్కకు తీసుకుని విమానాశ్రయం లోపలకు పంపించేశారు. కాగా.. సీఎం జగన్ చెబితే జనసేనానిపై పోటీకి సిద్ధమని నగరిలో చెప్పిన ఆలీ విమానాశ్రయంలో మాత్రం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడం గమనార్హం.