నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2023-08-02T01:58:14+05:30 IST
విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు హెచ్చరించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 1: విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జిల్లాపరిషత్ కార్యాలయంలోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు. విధుల్లో సక్రమంగా పనిచేయని కొంతమంది సిబ్బందిని పిలిచి మందలించారు. సెలవులో వెళ్లే ఉద్యోగులు ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. కోర్టు కేసులు, ఇతర ముఖ్యమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలన్నారు. ఇకపై ఉద్యోగులు తమ పనితీరు మార్చుకోవాలని, జడ్పీ ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో ప్రవర్తిస్తే తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రోజువారి కేటాయించిన విధులు, సాధించిన ప్రగతి, క్లియర్ చేసిన ఫైళ్ల వివరాలను ప్రతిరోజు సిబ్బంది నుంచి సేకరించి సీఈవోకు అందజేయాలని ఆయా విభాగాల సూపరింటెండెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.