Share News

బకాయిలు చెల్లించకుంటే దశలవారీగా ఆందోళన

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:34 PM

ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించకుంటే దశలవారీగా ఆందోళన బాట పడతామని యూటీఎఫ్‌ నాయకులు స్పష్టంచేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.వి.రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమశేఖర్‌ నాయుడు, మణిగండన్‌ సోమవారం డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉ

బకాయిలు చెల్లించకుంటే దశలవారీగా ఆందోళన
డీఆర్వోకు వినతిపత్రం అందజేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

డీఆర్వోకు వినతిపత్రం అందజేత

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 18: ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించకుంటే దశలవారీగా ఆందోళన బాట పడతామని యూటీఎఫ్‌ నాయకులు స్పష్టంచేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.వి.రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమశేఖర్‌ నాయుడు, మణిగండన్‌ సోమవారం డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేది జీతం ఇవ్వాలని ఉత్తర్వులో స్పష్టంగా ఉన్నా, ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లుగా ఆలస్యంగా చెలిస్తోందని ఆరోపించారు. పీఆర్సీ ముందున్న డీఏ బకాయిలు, పీఆర్సీ తర్వాత ఇచ్చిన డీఏ బకాయిలతో పాటు జడ్పీ పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఈఎల్‌ తదితర ఫైనల్‌ పేమెంట్లను వెంటనే చెల్లించాలని గతంలో జాయుంట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ద్వారా పలుసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై ఇప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగుచర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేపడతామని వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ ఆందోళనలో భాగంగా ఈ నెల 19, 20, 21వ తేదీల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాల సమర్పణ, 27న తాలూకా, డివిజన్‌ కేంద్రాల్లో ఆరు గంటల ధర్నా, 2024 జనవరి 3న జిల్లా కేంద్రంలో 12 గంటల పాటు ధర్నా నిర్వహిస్తామని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. డీఆర్వోను కలిసిన వారిలో యూటీఎఫ్‌ అసోసియేట్‌ అధ్యక్షురాలు రెహానాబేగం, స్టేట్‌ కౌన్సిలర్‌ ఎస్‌.పి.బాషా, జిల్లా కార్యదర్శులు రెడ్డెప్ప నాయుడు, సరిత, సురేష్‌, గణే్‌షకుమార్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:34 PM