పులిగుండులో వైభవంగా గిరిప్రదక్షిణ
ABN , First Publish Date - 2023-01-07T00:29:59+05:30 IST
పౌర్ణమిని పురస్కరించుకుని పులిగుండులో శుక్రవారం గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయమే అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నైవేద్యం సమర్పించారు.
పెనుమూరు, జనవరి 6: పౌర్ణమిని పురస్కరించుకుని పులిగుండులో శుక్రవారం గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయమే అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నైవేద్యం సమర్పించారు. సాయంత్రం ఠానా వేణుగోపాలపురం, సీఎస్ అగ్రహారం, కొత్తరోడ్డు మీదుగా స్వామి వారి గిరిప్రదక్షిణ నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి భక్తులకు అన్నదానం చేశారు. గుడ్యాణంపల్లి గ్రామానికి చెందిన గోపాలమందడి, నిర్మల కుటుంబ సభ్యులు ఉభయదారు లుగా వ్యవహరించారు. ఆలయ నిర్వాహకులు కేశవులురెడ్డి, గోవిందరెడ్డి, కనికాపురం, గుంటిపల్లి, సీఎస్ అగ్రహారం గ్రామస్తులు పాల్గొన్నారు.