కదిలిన గంజాయి డొంక

ABN , First Publish Date - 2023-04-03T01:27:42+05:30 IST

శ్రీకాళహస్తిలో పట్టుబట్ట గంజాయి స్మగ్లర్‌ ద్వారా తీగ లాగితే పెద్దడొంక కదలినట్లు తెలిసింది.

కదిలిన గంజాయి డొంక

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 2: శ్రీకాళహస్తిలో పట్టుబట్ట గంజాయి స్మగ్లర్‌ ద్వారా తీగ లాగితే పెద్దడొంక కదలినట్లు తెలిసింది. నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ఏపీలోని పలు ప్రాంతాలతోపాటు బెంగళూరులోని పలు ప్రాంతాలకు అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి సరఫరా చేస్తుంటాడు. ఈఅంతర్రాష్ట్ర స్మగ్లర్‌పై శ్రీకాళహస్తి పోలీసులు పక్కాగా రెక్కీ నిర్వహించారు. రెండ్రోజుల కిందట బస్సులో 12 కిలోల గంజాయితో ప్రయాణిస్తుండగా శ్రీకాళహస్తి పట్టణ శివారులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే అతడి వద్ద ఇటీవల గంజాయి కొనుగోలు చేసిన వారి కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం శ్రీకాళహస్తి, తిరుపతితోపాటు పలు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు సాగించేవారిని గుర్తించి సుమారు 15మందిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - 2023-04-03T01:27:42+05:30 IST