చౌక దుకాణాలను తనిఖీ చేసిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2023-09-20T01:23:31+05:30 IST

కేంద్ర బృంద సభ్యులు చిత్తూరు పరిసర ప్రాంతాల్లోని చౌక దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు.

చౌక దుకాణాలను తనిఖీ చేసిన కేంద్ర బృందం
మిట్టూరు చౌక దుకాణంలో కార్డుదారులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 19: కేంద్ర బృంద సభ్యులు చిత్తూరు పరిసర ప్రాంతాల్లోని చౌక దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. మిట్టూరు, పెనుమూరు మండలం పూనేపల్లిలోని దుకాణాలను సభ్యులు జీఎన్‌ శర్మ, ఎం.ఎన్‌.సిన్హా పరిశీలించారు. కేంద్రం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యానికి డబ్బులు తీసుకుంటున్నారా? బియ్యం నాణ్యత ఎలా ఉంది? చౌకదుకాణాల డీలర్ల ప్రవర్తన తదితర అంశాలను కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. వీరివెంట డీఎస్వో శంకరన్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు మోహన్‌బాబు, ఏఎస్వో శేషాచలం రాజు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-09-20T01:23:31+05:30 IST