ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు ఎంబీయూ విద్యార్థికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2023-03-20T00:20:17+05:30 IST

మండలంలోని తిరుపతి - పీలేరు జాతీయ రహ దారిలో ద్విచక్ర వాహ నాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది.

 ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు  ఎంబీయూ విద్యార్థికి తీవ్ర గాయాలు
ఉదయ్‌కిరణ్‌ను చికిత్సకు తరలిస్తున్న దృశ్యం

చంద్రగిరి, మార్చి 19: మండలంలోని తిరుపతి - పీలేరు జాతీయ రహ దారిలో ద్విచక్ర వాహ నాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసుల కథనం మేరకు.. పాకాలకు చెందిన ఉదయ్‌కిరణ్‌ ఎంబీయూలో చదువు తున్నాడు. ఆదివారం మధ్యా హ్నం తిరుపతి నుంచి ద్విచక్ర వాహనంపై మోహన్‌బాబు విశ్వవిద్యాల యానికి వెళుతుండగా మార్గమధ్యంలోని వెంకట పద్మావతి కళాశాల వద్ద బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-20T00:20:17+05:30 IST