సచివాలయాల్లో 540 పౌరసేవలు
ABN , First Publish Date - 2023-09-22T00:47:27+05:30 IST
సచివాలయాల్లో 540 పౌరసేవలను అందుబాటులో ఉంచామని డీఆర్వో రాజశేఖర్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 21: సచివాలయాల్లో 540 పౌరసేవలను అందుబాటులో ఉంచామని డీఆర్వో రాజశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లా రిజిస్ట్రార్ ఎం.శ్రీనివాసరావు, నోటరీలతో సమావేశం నిర్వహించారు. సచివాలయాల సేవలను విడతల వారీగా విస్తృతం చేస్తున్నామన్నారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీ, మ్యూటేషన్లకు సంబంధించి నోటరీలు సోమ, గురువారాల్లో సచివాలయాల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. ఏ సచివాలయంలో ఏ నోటరీ ఉండాలనే విషయాన్ని మ్యాపింగ్ చేస్తామన్నారు.