చిత్తూరు, తవణంపల్లెలో 40.9 డిగ్రీలు
ABN , First Publish Date - 2023-06-07T23:47:39+05:30 IST
ఎండ తగ్గడంలేదు. వారం రోజులుగా భగభగమంటున్న భానుడు బుధవారం మరింత మండిపోయాడు. చిత్తూరు, తవణంపల్లె మండలాల్లో గరిష్ఠంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 7: ఎండ తగ్గడంలేదు. వారం రోజులుగా భగభగమంటున్న భానుడు బుధవారం మరింత మండిపోయాడు. చిత్తూరు, తవణంపల్లె మండలాల్లో గరిష్ఠంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, శ్రీరంగరాజపురంలో 40.4, గుడిపాలలో 39.9, పాలసముద్రంలో 39.7, గంగాధరనెల్లూరులో 39.2, నిండ్రలో 39.2, ఐరాలలో 38.6, కార్వేటినగరంలో 38.6, పూతలపట్టులో 38.4, విజయపురంలో 38.3, పలమనేరులో 37.9, పెనుమూరులో 37.9, యాదమరిలో 37.6, నగరిలో 36.9, చౌడేపల్లిలో 36.8, సదుంలో 36.5, బంగారుపాళ్యంలో 36.3, వెదురుకుప్పంలో 36.2, గంగవరంలో 36, బైరెడ్డిపల్లిలో 35.8, సోమల 35.8, పెద్దపంజాణిలో 35.8, రొంపిచెర్లలో 35.2, కుప్పంలో 35, పులిచెర్లలో 34.9, వి.కోటలో 34.4, పుంగనూరులో 34.2, శాంతిపురంలో 32.7, గుడుపల్లెలో 32.2, రామకుప్పంలో 31.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో మధ్యాహ్నం వేళ జనసంచారం లేక రోడ్లు బోసిపోయి కనిపించాయి.