కలెక్టరేట్‌ స్పందనకు 359 అర్జీలు

ABN , First Publish Date - 2023-09-26T01:01:06+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు 369 మంది వినతిపత్రాలను ఇచ్చారు. డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు వీటిని స్వీకరించారు.

కలెక్టరేట్‌ స్పందనకు 359 అర్జీలు
అర్జీదారుడితో మాట్లాడుతున్న డీఆర్వో రాజశేఖర్‌

చిత్తూరు, సెప్టెంబరు 25: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు 369 మంది వినతిపత్రాలను ఇచ్చారు. డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు వీటిని స్వీకరించారు. ఇందులో రెవెన్యూశాఖకు 288 అర్జీలు, మండల్‌ లెవల్‌ కో-ఆర్టినేటర్‌ కమిటీకి 18, పెన్షన్‌, రేషన్‌కార్డులకు 12, మిగిలిన అన్ని శాఖలకు కలిపి 51 అర్జీలు అందాయి.

ఫ ఏనుగుల దాడుల నుంచి పంట పొలాలతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడాలని పాకాల మండలం పుదిపట్లబయలు పంచాయతీ పుల్లావాండ్లపల్లె రైతులు అధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. పంటలపై దాడులతో అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

ఫ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల పోస్టుల హేతుబద్దీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన సహాయకులు డిమాండ్‌ చేశారు. హేతుబద్దీకరణలో క్రాప్‌ బుకింగ్‌ అయిన విస్తీర్ణాన్ని మాత్రమే ప్రాతిపదికన తీసుకున్నారని, సీపీవో పంట నమోదును పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

పోలీసు స్పందనకు 30 ఫిర్యాదులు

పాత పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 30 మంది బాధితులు హాజరై సమస్యలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి, సెబ్‌ ఏఎస్పీ శ్రీలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. భూ తగాదాల కింద 7, ఇంటి తగాదాలు 6, కుటుంబ తగాదాలు 5, పోలీసు సేవలు 4, దారి తగాదాలు 3, వేధింపులు 02, భర్త వేధింపులు 2 వంతున అర్జీలు అందాయి.

Updated Date - 2023-09-26T01:01:06+05:30 IST