ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 179 మంది బదిలీ

ABN , First Publish Date - 2023-06-25T00:48:22+05:30 IST

జిల్లాలో ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 179 మందిని బదిలీ చేస్తూ డీసీహెచ్‌ఎ్‌స బీసీకే నాయక్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 179 మంది బదిలీ

చిత్తూరు రూరల్‌, జూన్‌ 24: జిల్లాలో ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 179 మందిని బదిలీ చేస్తూ డీసీహెచ్‌ఎ్‌స బీసీకే నాయక్‌ ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 143 మంది నర్సులు బదిలీ కాగా.. 10 మంది ఇతర జిల్లాలకు, 23 మంది ఇతర జిల్లాల నుంచి చిత్తూరుకు బదిలీ అయ్యి వచ్చారు. అలాగే హెడ్‌ నర్సలు 10 మంది, వైద్యులు 21 మంది, రేడియోగ్రాఫర్లు ముగ్గురు, ఫార్మసీ సూపర్‌వైజర్‌ ఒకరు, జూనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు బదిలీ అయ్యారు.

Updated Date - 2023-06-25T00:48:22+05:30 IST