జిల్లాకు చేరిన టెన్త్‌ ప్రశ్నపత్రాలు

ABN , First Publish Date - 2023-03-22T00:56:31+05:30 IST

పదో తరగతి ప్రశ్నపత్రాలు మంగళవారం జిల్లాకు చేరాయి. చిత్తూరులో డీఆర్వో రాజశేఖర్‌ సమక్షంలో డీఈవో విజయేంద్రరావు, పరీక్షల సహాయ కమిషనరు గురుస్వామిరెడ్డి ప్రశ్నపత్రాల కంటైనర్ల సీల్‌ తీసి డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు.

జిల్లాకు చేరిన టెన్త్‌ ప్రశ్నపత్రాలు

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 21: పదో తరగతి ప్రశ్నపత్రాలు మంగళవారం జిల్లాకు చేరాయి. చిత్తూరులో డీఆర్వో రాజశేఖర్‌ సమక్షంలో డీఈవో విజయేంద్రరావు, పరీక్షల సహాయ కమిషనరు గురుస్వామిరెడ్డి ప్రశ్నపత్రాల కంటైనర్ల సీల్‌ తీసి డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. అనంతరం 11 రూట్ల ద్వారా జిల్లాలోని 115 పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీసుస్టేషన్లకు వీటిని తరలించి భద్రపరిచారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 21,996 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనున్నారు. కాగా, బుధవారం రెండో సెట్‌ ప్రశ్నపత్రాలు విజయవాడ నుంచి జిల్లాకు రానున్నాయి.

Updated Date - 2023-03-22T00:56:31+05:30 IST