Share News

డెయిరీ కార్మికుల దీక్షకు 100 రోజులు

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:23 AM

తమకు రావాల్సిన పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని కోరుతూ విజయా డెయిరీ కార్మికులు కలెక్టరేట్‌ ముందు చేపట్టిన దీక్ష గురువారానికి వంద రోజులకు చేరింది.

డెయిరీ కార్మికుల దీక్షకు 100 రోజులు
కలెక్టరేట్‌ ముందు దీక్ష చేస్తున్న డెయిరీ కార్మికులు

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 21: తమకు రావాల్సిన పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని కోరుతూ విజయా డెయిరీ కార్మికులు కలెక్టరేట్‌ ముందు చేపట్టిన దీక్ష గురువారానికి వంద రోజులకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు కుమార్‌, ఎబినేజర్‌, రూబన్‌, కరీం తదితరులు మాట్లాడుతూ నెల రోజుల్లో తమకు న్యాయం చేస్తానని కలెక్టర్‌ ఇచ్చిన హామీ.. ప్రభుత్వం తమకు ఇచ్చిన మాటనూ ఇంకా నెరవేర్చలేదన్నారు. డెయిరీని అమూల్‌కు అప్పగించే సమయానికి కార్మికులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఫలితం లేకుండా పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం, కలెక్టర్‌ తమను ఆదుకుని న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Dec 22 , 2023 | 12:23 AM