Share News

Jaleel Khan: ఓటమి భయంతో చంద్రబాబు అరెస్ట్.. జగన్‌ను తరిమి కొట్టడం ఖాయం

ABN , First Publish Date - 2023-10-25T20:50:15+05:30 IST

జగన్ సర్కారుపై (Jagan Govt) మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ (Jaleel Khan) విమర్శలు గుప్పించారు.

Jaleel Khan: ఓటమి భయంతో చంద్రబాబు అరెస్ట్.. జగన్‌ను తరిమి కొట్టడం ఖాయం

విజయవాడ: జగన్ సర్కారుపై (Jagan Govt) మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ (Jaleel Khan) విమర్శలు గుప్పించారు. జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. దసరాలో రాక్షస సంహారం జరిగినట్లుగా ఏపీలో రాక్షస పాలనను తరిమి కొట్టాలంటూ సైకో పాలన పేరుతో ఉన్న కర పత్రాలను జలీల్ ఖాన్ దగ్ధం చేశారు.

"ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను నట్టేట ముంచారు. ఈ సైకో పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపారు. జగన్‌కు ధైర్యం ఉంటే దమ్ముగా రాజకీయాలు చేయాలి. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. చంద్రబాబు బయటకి వస్తారు. వచ్చే ఎన్నికలలో జగన్‌ను తరిమి కొట్టడం ఖాయం." అని జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-25T20:58:31+05:30 IST