Chalasani Srinivas: బీజేపీ విష కౌగిలి నుంచి పవన్ బయటకు రావాలి

ABN , First Publish Date - 2023-09-15T11:05:08+05:30 IST

అగ్రిగోల్డ్ బాధితులను జగన్ మోసం చేశారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు.

Chalasani Srinivas: బీజేపీ విష కౌగిలి నుంచి పవన్ బయటకు రావాలి

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులను జగన్ మోసం చేశారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హామీ అమలు చేయమంటే అరెస్టు చేయిస్తున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దమన కాండ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కనుసన్నల్లో జగన్ పని చేస్తున్నారని ఆరోపించారు. దుర్మార్గమైన కుట్రలు చేస్తున్న జగన్, మోడీలను ఓడించాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే మెడలు వంచుతా అని జగన్ అన్నారని.. 33మంది ఎంపీలు ఉన్నా మోడీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ విష కౌగిలి నుంచి బయటకు రావాలన్నారు. పాచిపోయిన లడ్డూ అన్న పవన్ కళ్యాణ్ వాళ్లతో ఎలా నడుస్తారని నిలదీశారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ల కోసం అందరూ పోరాడాలని చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-15T11:05:08+05:30 IST