Share News

BV Raghavulu : రైలు ప్రమాదం జరగడం చాలా బాధాకరం

ABN , First Publish Date - 2023-10-30T12:15:57+05:30 IST

కంటకాపల్లి రైలు ప్రమాదంలో గాయపడిన వారిని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు.

BV Raghavulu : రైలు ప్రమాదం జరగడం చాలా బాధాకరం

విజయనగరం : కంటకాపల్లి రైలు ప్రమాదంలో గాయపడిన వారిని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ.. రైలు ప్రమాదం జరగడం చాలా బాధాకరమన్నారు. తీవ్ర గాయాలైన వారికి ప్రత్యేక చికిత్స అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా క్షతగాత్రుల్లో ఉన్నారన్నారు. వారికి అవసరమైన సహకారం అందించాలని బీవీ రాఘవులు అన్నారు. బాలాసోర్ ఘటన జరిగిన తక్కువ సమయంలోనే ఈ ప్రమాదం జరగడం దారుణమన్నారు. కేంద్రం, రైల్వే అధికారులు శిక్ష వేసుకోవాలన్నారు. బాలాసోర్ వంటి దుర్ఘటన జరిగిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షలు, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాఘవులు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-30T12:15:57+05:30 IST