Bonda Uma : రాష్ట్రానికి దరిద్రం పట్టి నేటికి 4 ఏళ్ళు

ABN , First Publish Date - 2023-05-23T12:26:41+05:30 IST

పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీల భారాలను తగ్గించాలని కోరుతూ... టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. రాష్ట్రానికి దరిద్రం పట్టి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతోందన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తూ విద్యుత్ చార్జీలు పెరగవు అని హామీ ఇచ్చారన్నారు.

Bonda Uma : రాష్ట్రానికి దరిద్రం పట్టి నేటికి 4 ఏళ్ళు

విజయవాడ : పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీల భారాలను తగ్గించాలని కోరుతూ... టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. రాష్ట్రానికి దరిద్రం పట్టి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతోందన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తూ విద్యుత్ చార్జీలు పెరగవు అని హామీ ఇచ్చారన్నారు. 4 ఏళ్ల పాలనలో 7 సార్లు చార్జీలు పెంచి రూ.57 వేల కోట్లు ప్రజలపై భారం వేశారన్నారు. ఎప్పుడు వినని విధంగా ట్రూ అప్ చార్జీల పేరుతో భారం వేశారని బోండా ఉమ దుయ్యబట్టారు.

‘‘కొత్తగా టీఓడీ టైం ఆఫ్ డే పేరుతో ప్రతి నెల చార్జీలు పెంచుకునేలా డిస్కంలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి చార్జీల భారాలు లేకుండా పెంచేవారు. ఇప్పుడు ఏకపక్షంగా దొడ్డిదారిన డిస్కంలకు చార్జీలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చింది. గత ప్రభుత్వం చార్జీలు పెంచకుండా ప్రణాళిక చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక 7 సార్లు పెంచారు. ఎస్సీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ తీసేశారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. బాదుడే బాదుడు అని మాట్లాడిన జగన్ నేడు ప్రజలపై నెల నెలా బాదుడు కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. తక్షణమే చార్జీలు తగించాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం’’ అని బోండా ఉమ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-23T12:26:41+05:30 IST