విద్యుత్తు సంస్థల్లో హాజరు ఆధారిత జీతాలు

ABN , First Publish Date - 2023-03-31T03:43:49+05:30 IST

విద్యుత్తు సంస్థల్లో శనివారం నుంచి ఉద్యోగులకు హాజరు ఆధారిత జీతాల చెల్లింపు విధానం అమల్లోనికి రానున్నది.

విద్యుత్తు సంస్థల్లో హాజరు ఆధారిత జీతాలు

జెన్కో ఎండీ శ్రీధర్‌ ఉత్తర్వులు

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సంస్థల్లో శనివారం నుంచి ఉద్యోగులకు హాజరు ఆధారిత జీతాల చెల్లింపు విధానం అమల్లోనికి రానున్నది. ఉద్యోగులు కార్యాలయాలకు ఉదయం వచ్చినప్పుడు, సాయంత్రం పని ముగించుకున్న సమయంలో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ విధానంలో హాజరు వేయాల్సి ఉంటుందని జెన్కో ఎండీ బీ శ్రీధర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం సవరించిన ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వును ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాలకూ పంపారు. విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో ఉద్యోగుల హాజరు నమోదుపై విభాగాధిపతులు మరింత శ్రద్ధ తీసుకోవాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే జీతభత్యాల చెల్లింపు నెలవారి స్టేట్‌మెంట్‌ ఉంటుందని ఎండీ స్పష్టం చేశారు. కాగా, సవరించిన బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి.

Updated Date - 2023-03-31T03:43:49+05:30 IST