‘మార్గదర్శి’ ఆడిటర్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-03-31T03:41:57+05:30 IST

‘మార్గదర్శి’ ఆడిటర్‌ అరెస్ట్‌

‘మార్గదర్శి’ ఆడిటర్‌ అరెస్ట్‌

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ కూదరవల్లి శ్రావణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఫైనాన్స్‌ సంస్థపై నమోదు చేసిన కేసు విషయంలో సీఐడీ అధికారులు శ్రావణ్‌ ఇంట్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఆరోపించిన సీఐడీ గురువారం శ్రావణ్‌ను అరెస్టు చేసింది. విజయవాడ మూడో మెట్రో పాలిటన్‌ కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడీషియల్‌ రిమాండు విధించింది. మార్గదర్శి చార్టెడ్‌ అకౌంటెంట్‌ నుంచి పలు డాక్యుమెంట్లను సీఐడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-03-31T03:41:57+05:30 IST