Share News

AP Govt: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌ లైన్స్ విడుదల

ABN , Publish Date - Dec 13 , 2023 | 09:25 PM

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌ లైన్స్ విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. గైడ్ లైన్స్ పై సర్క్యులర్ మెమో ద్వారా ఆర్థిక శాఖ నేడు జారీ చేసింది.

AP Govt: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌ లైన్స్ విడుదల

అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌‌లైన్స్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సర్క్యులర్ మెమో ద్వారా ఆర్థిక శాఖ బుధవారం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించింది.

కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగుల నమోదు ప్రక్రియకు సన్నాహకాలు జరుగుతున్నాయని, సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Dec 13 , 2023 | 09:40 PM